గ్రామీణ వైద్యం.. బలోపేతం

ABN , First Publish Date - 2020-03-02T12:20:55+05:30 IST

గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పనితీరును మరింత పటిష్టం చేసే దిశగా సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా పలు నూతన సంస్కరణలు అమలు

గ్రామీణ వైద్యం.. బలోపేతం

  • ఒక ఆరోగ్య కేంద్రంలో...    ఇద్దరు వైద్యులు!
  • ఉదయం 8 నుంచి  రాాత్రి 8 వరకు పని గంటలు
  • రాత్రి వేళ్లల్లో పారా మెడికల్‌ సిబ్బందితో సేవలు
  • గ్రామీణ వైద్యసేవల బలోపేతంపై సర్కారు యోచన

గుంటూరు (మెడికల్‌): గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పనితీరును మరింత పటిష్టం చేసే దిశగా సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా పలు నూతన సంస్కరణలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆయా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల అభిప్రాయాలు సేకరించారు. ఇందులో భాగంగా డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. ఈ నూతన మార్పులు చేస్తే గ్రామీణ వైద్యం మరింత బలోపేతం అవుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. 


త్వరలో విలేజ్‌ క్లినిక్‌లు..


గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవల బలోపేతం చేసే దిశలో కొత్తగా సర్కారు వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రెండు వేల మంది గ్రామీణులకు సేవలందించేందుకు ఈ క్లినిక్‌లో  ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సు అందుబాటులో ఉంటారు. ప్రదానంగా గ్రామసచివాలయా ల వద్ద వీరు మొబైల్‌ క్లినిక్‌లను అదుబాట్లోకి ఉంచి స్థానికులకు సేవలు అందించేలా ప్రణాళి కలు రూపొందిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెడుతు న్న గతంలో 104 ఆంబులెన్స్‌ వాహనాల్లో ఫిక్స్‌డే డే హెల్త్‌ సర్వీసెస్‌ పేరిట గ్రామాల్లో సేవలు అందించేవారు. అప్పట్లో జిల్లాలో సుమారు 26 వాహనాలను ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి మండలానికి ఒక వాహనం కేటాయించాలని నిర్ణయించారు. దీనివల్ల జిల్లాలో 57 మండలాల్లో వాహనాలు అందుబాట్లోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ ఏడాది మే నాటికి ఈ వాహనాలు అందుబా ట్లోకి వస్తాయని భావిస్తు న్నారు. 


ఇద్దరు డాక్టర్లు


జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక వైద్యుడే విధుల్లో ఉంటున్నారు. (24 గంటలూ పని చేసే పీహెచ్‌సీల్లో ఇద్దరు డాక్టర్లు ఉంటున్నారు). సదరు వైద్యుడు సెలవు పెట్టినా, గైర్హాజరైన రోగులకు వైద్యసేవలు అందే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కో ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరేసి వైద్యులను నియమిస్తే ఎలా ఉంటుందని? సర్కారు యోచిస్తోంది. ఇప్పటివరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇకపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు ఆరోగ్య కేంద్రం పని చేసేలా డ్యూటీ వేళలు పెంచాలని భావిస్తోంది. రాత్రి ఎనిమిది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు పీహెఛ్‌సీల్లో సేవలు అందించేందుకు ప్రత్యేకంగా పారా మెడికల్‌ ఉద్యోగిని(స్టాఫ్‌ నర్స్‌/ మిడ్‌ లెవెల్‌ ప్రొవైడర్‌)ను అందుబాట్లో ఉంచాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. జిల్లాలోని 87 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ కొత్త విధానం అందుబాట్లోకి తెస్తే ఎలా ఉంటుందని? ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయి. 


బయోమెట్రిక్‌


పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్య సిబ్బందిలో మరింత జవాబుదారితనం పెంచేందుకు, సకాలంలో వారు విధులకు హాజరయ్యేం దుకు ప్రభుత్వం మార్చి ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్‌ హాజరును తప్పని సరి చేసింది. ఇప్పటికే పీహెచ్‌సీల్లో బయో మెట్రిక్‌ హాజరు నమోదు ఉన్పటికి అంత గా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. ఇకపై బయోమెట్రిక్‌ హాజరు నమోదు ఆధారంగా జీతాలు చెల్లించే విధంగా  ఆర్ధిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల బయోమెట్రిక్‌ హాజరు వేయని వారికి జీతాల్లో కోత తప్పదు. గత రెండువారాలుగా జిల్లాలో ఆరోగ్యకేంద్రాల్లో నమోదైన హాజరు వివరాలను డీఎంహెచ్‌ వో ప్రతి రోజు ఉదయం 10 గంటలకల్లా సాధారణ పరిపాలన విభాగానికి(జీఏడీ) పంపుతున్నారు. జీఏడీ విభాగం వారు అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ హాజరు నమోదు వివరాలను ఆర్థికశాఖకు పంపుతున్నారు. వీరు హాజరును పరిశీలిం చి అందుకు అనుగుణంగా జీతాలను చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పీహె చ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది సెలవు తీసుకోవాలంటే కూడా ఇకపై ఆన్‌లైన్‌లో డీఎంహెచ్‌వోకు దరఖాస్తు చేసుకోవాలి. డీఎంహెచ్‌వో కూడా ఆన్‌లైన్‌లోనే వెంటనే అనుమతి జారీ చేస్తారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో కాకుండా, సాధారణ లీవ్‌ లెటర్‌ పెడితే దానిని సాంకేతికంగా అనధికార గైర్హాజరుగా పరిగణించి జీతంలో కోత విధిస్తారు.

Updated Date - 2020-03-02T12:20:55+05:30 IST