యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-11T06:15:03+05:30 IST

యువత ప్రాథమిక స్థాయి నుంచే చదువుతోపాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య తెలిపారు.

యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
మాట్లాడుతున్న డాక్టర్‌ లావు రత్తయ్య

విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

గుంటూరు(విద్య), డిసెంబరు 10:  యువత ప్రాథమిక స్థాయి నుంచే చదువుతోపాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య తెలిపారు. విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలని, అప్పుడే ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం లేదా తామే పారిశ్రామికవేత్తలుగా మారడమో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, స్టూడెంట్స్‌ అఫైర్స్‌ డీన్‌ ఎంఎంఎస్‌ఎస్‌ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:15:03+05:30 IST