17వ తేదీ లోపు పింఛన్‌ దరఖాస్తులు పునఃపరిశీలించాలి

ABN , First Publish Date - 2020-02-12T11:31:18+05:30 IST

సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించిన అభ్యంతరాలు, దరఖాస్తులను ఈ నెల 17వ తేదీలోపు పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. 19వ తేదీన

17వ తేదీ లోపు పింఛన్‌ దరఖాస్తులు పునఃపరిశీలించాలి

గుంటూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించిన అభ్యంతరాలు, దరఖాస్తులను ఈ నెల 17వ తేదీలోపు పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. 19వ తేదీన సామాజిక తనిఖీ, 20న అర్హుల తుది జాబితాలు ప్రకటించాలని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. మార్చి 1వ తేదీ న అర్హులందరూ లబ్ధి పొందేలా అధికారులు ప్రత్యేక చొర వ తీసుకోవాలన్నారు. స్పందనలో వస్తున్న అర్జీలపై అధికారులు సానుకూలంగా స్పందించి పేదలకు న్యాయం చేయాలన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఉగాది రోజున నివేశన స్థలం ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ నాటికి నివేశన స్థలాలకు భూముల గుర్తింపు పూర్తి చేయాలి. భూములు సరిపోకపోతే మార్చి 1వ తేదీ నాటికి భూసేకరణ చేపట్టాలన్నారు. మార్చి 15వ తేదీ నాటికి ఫ్లాట్ల లేఅవుట్‌లు పూర్తి చేయాలని, ఉగాది రోజున ప్రభుత్వం ఇచ్చే నివేశన స్థలంతో ప్రతీ ఇంట్లో పండుగ వాతావరణం కనిపించాలన్నారు. జగనన్న విద్యా, వసతి దీవెన కార్యక్రమాల కింద అర్హులైన విద్యార్థులకు ఈ నెల 24వ తేదీన నగదు పంపిణీ చేస్తామని, 25వ తేదీన కార్డులు అందజేస్తామని చెప్పారు. రజకులు, నాయీబ్రాహ్మణులు, జైలర్లకు ఇచ్చిన హామీల్లో భాగంగా రూ. 10 వేల చొప్పున ఆర్థికసాయాన్ని మార్చి నెలలో అందజేస్తామన్నారు. కాపునేస్తం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయలని ఆదేశించారు. సచివాలయాల్లో పని చేస్తోన్న మహిళ పోలీసులకు సెల్‌ఫోన్లను అందజేస్తామన్నారు. సచివాలయాలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. మార్చి 31వ తేదీలోపు బియ్యం, ఆరోగ్యశ్రీ, పింఛన్‌కార్డుల పంపిణీ పూర్తి కావాల్సిందేనన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలను ఆటోమ్యుటేషన్‌ ద్వారా అనుసంధాన ప్రక్రియని ఈ సందర్భంగా సీఎం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన జాయిం ట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినే్‌షకుమార్‌ మాట్లాడుతూ ఆరోగ్య ఉపకేంద్రాలకు స్థలాల గుర్తింపు నిర్దేశిత సమయంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకొంటామన్నారు. ఆత్మహత్య లు చేసుకొన్న రైతులకు పరిహారం వెంటనే అందించేందుకకు చర్యలు తీసుకొంటోన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి, జేసీ-2 శ్రీధర్‌రెడ్డి, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, సీపీవో బాలకృష్ణమూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-12T11:31:18+05:30 IST