నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్‌

ABN , First Publish Date - 2020-12-19T05:57:50+05:30 IST

ఆటోలో ప్రయాణికురాలుమరిచిపోయిన నగదు బ్యాగ్‌ను పోలీసులకు అందించిన డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు.

నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్‌

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 18: ఆటోలో ప్రయాణికురాలుమరిచిపోయిన నగదు బ్యాగ్‌ను పోలీసులకు అందించిన డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు. గుంటూరులో మల్లేష్‌ నడుపుతున్న ఆటోలో షేక్‌ ఆషా అనే మహిళ బ్యాగును మరిచిపోయింది. అందులో రూ.11 వేల నగదు, దుస్తులు ఉన్నాయి. ఆ బ్యాగును మల్లేష్‌ గుర్తించి పాత గుంటూరు పోలీసులకు అప్పగించారు. కొద్దిసేపటికి ఆమె తన బ్యాగు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె బ్యాగును అందజేశారు.  

Read more