మార్కులు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-12T05:14:54+05:30 IST

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలో మార్కులు తక్కువచ్చాయని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సేవానాయక్‌ తండాలో చోటుచేసుకుంది.

మార్కులు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

 వెల్దుర్తి, డిసెంబరు 11: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలో మార్కులు తక్కువచ్చాయని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సేవానాయక్‌ తండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమావత్‌ పాపానాయక్‌ పెద్ద కుమార్తె హరితాబాయి(16) టెన్త్‌ పూర్తి చేసింది. వారం క్రితం ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష రాసింది. ట్రిపుల్‌ ఐటీ కీలో తక్కువ మార్కులు వచ్చాయంటూ తండ్రి పాపానాయక్‌ కుమార్తెను మంగళవారం మందలించాడు. అప్పటినుంచి హరితాబాయి కనిపించకుండా పోయింది. కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు బంధువులు, తెలిసిన వారందరి వద్ద విచారించారు. కాగా శుక్రవారం ఉదయం జీవాల కాపరులు మేతకు పొలాల వైపు వెళ్లగా అక్కడి బావిలో మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. గ్రామస్తులు అక్కడకు చేరుకొని మృతదేహం హరితాబాయిగా గుర్తించారు. మాచర్ల రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, వెల్దుర్తి ఎస్‌ఐ సుధీర్‌ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2020-12-12T05:14:54+05:30 IST