ఉద్యమనేత కేశవరెడ్డికి నివాళులు

ABN , First Publish Date - 2020-11-27T05:49:19+05:30 IST

సీనియర్‌ నాయకులు, రచయిత కొమ్మారెడ్డి కేశవరెడ్డి గురువారం ఆకస్మికంగా మృతి చెందినట్లు యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు ప్రేమ్‌కుమార్‌, నాగమల్లేశ్వరరావు తెలిపారు.

ఉద్యమనేత కేశవరెడ్డికి నివాళులు
నివాళులర్పిస్తున్న బాబురెడ్డి తదితరులు

గుంటూరు(విద్య), నవంబరు 26: సీనియర్‌ నాయకులు, రచయిత కొమ్మారెడ్డి కేశవరెడ్డి గురువారం ఆకస్మికంగా మృతి చెందినట్లు యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు ప్రేమ్‌కుమార్‌, నాగమల్లేశ్వరరావు తెలిపారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని సందర్శించిన నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాల మండలం అంబాపురంలో శ్రామిక కుటుంబంలో జన్మించిన కేశవరెడ్డి సూర్యాపేటలో ఉపాధ్యాయుడిగా పని చేశారన్నారు. సాహిత్యం, కళలపై ఎన్నో రచనలు చేశారన్నారు. రాష్ట్ర కార్యదర్శి బాబురెడ్డి, రాష్ట్ర సహాధ్యక్షుడు ఎన్‌ వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు రామరావు, ప్రచురణల కమిటీ కన్వీనర్‌ ఎం హనుమంతరావు తదితరులు నివాళులర్పించారు.


Read more