ఉప్పలపాడు పక్షుల కేంద్రం పునః ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-21T05:48:17+05:30 IST

మండల పరిధిలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని శుక్రవారం పునః ప్రారంభించారు.

ఉప్పలపాడు పక్షుల కేంద్రం పునః ప్రారంభం
రాజధాని రైతుల సఃఘీభావ సభలో మాట్లాడుతున్న ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాధ్‌,

పెదకాకాని:  మండల పరిధిలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని శుక్రవారం పునః ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించగా ఈ ఏడాది మార్చి నుంచి పక్షుల కేం ద్రాన్ని నిలిపివేశారు. సుమారు 8 నెలల తరువాత పక్షుల కేంద్రాన్ని పునః ప్రారం భించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అవకాశం కల్పిస్తారు. ప్రతి ఒక్కరు రూ.10 చెల్లించి పక్షుల కేంద్రాన్ని వీక్షించవచ్చని పక్షుల కేంద్రం అభివృద్ధి సంఘం అధ్యక్షుడు అనిల్‌ తెలిపారు. 

Read more