అదుపుతప్పిన ద్విచక్ర వాహనం

ABN , First Publish Date - 2020-03-18T11:05:20+05:30 IST

మద్యంమత్తులో వే గంగా నడుపుతున్న ద్విచక్రవాహనం మ లుపు వద్ద అదుపుతప్పి పడిపోవటంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన గుత్తి కొండ సమీపంలో

అదుపుతప్పిన ద్విచక్ర వాహనం

ఒకరి మృతి... మరొకరికి గాయాలు

పిడుగురాళ్ల, మార్చి 17: మద్యంమత్తులో వే గంగా నడుపుతున్న ద్విచక్రవాహనం  మ లుపు వద్ద అదుపుతప్పి పడిపోవటంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన గుత్తి కొండ సమీపంలో మంగళవారం జరిగింది. చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన యిరపని నాగేంద్రబాబు (25), బత్తుల తిరుపతయ్య ద్విచక్రవాహనంపై మాచర్లలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు.


మార్గమధ్యలో మద్యం తాగి, వాహనం నడుపుతుండగా గుత్తికొండ సమీపం లోని మలుపువద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో వాహనం నడుపుతున్న నాగేంద్రబాబు అక్కడికక్కడే మృతిచెందగా, తిరుపతయ్యకు గాయపడ్డాడు. నాగేంద్రబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-03-18T11:05:20+05:30 IST