పేదలకు విద్యను దూరం చేస్తున్న జగన్
ABN , First Publish Date - 2020-12-29T05:54:04+05:30 IST
పేదలకు విద్యను సీఎం జగన్ దూరం చేస్తున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా నేతలు మండిపడ్డారు.
టీఎన్‌ఎస్‌ఫ్ జిల్లా నేతలు
గుంటూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): పేదలకు విద్యను సీఎం జగన్ దూరం చేస్తున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా నేతలు మండిపడ్డారు. 2020-21 విద్యాసంవత్సరంలో ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలో పీజీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన వర్తించబోవని జీవో నెంబర్ 77ను విడుదల చేయటంపై నేతలు మండిపడ్డారు. గుంటూరు పార్లమెంటు తెలుగు విద్యార్థి అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ నేతృత్వంలో గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జీవీను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు రాయపాటి అమృతరావు, పిన్నపాటి జీవన్, ధర్మతేజ, సాయి, వెంకట తరుణ్, భరత్, వరుణ్ తేజ్, టీడీపీ నేతలు పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు, లంకా మాధవి తదితరులు పాల్గొన్నారు.