ఈ మూడు సిటీలే కరోనా హాట్ స్పాట్లు.. రికవరీ రేటు విషయంలో షాకింగ్ న్యూస్..!

ABN , First Publish Date - 2020-06-25T16:20:28+05:30 IST

గుంటూరు జిల్లాలోని పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం గుంటూరు, నరసరావుపేట, తాడేపల్లి పట్టణ ప్రాంతాల్లో నమోదైనవే. ఈ మూడు పట్టణాలు

ఈ మూడు సిటీలే కరోనా హాట్ స్పాట్లు.. రికవరీ రేటు విషయంలో షాకింగ్ న్యూస్..!

హాట్ స్పాట్ లుగా గుంటూరు, నరసరావుపేట, తాడేపల్లి..


గుంటూరు(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలోని పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం గుంటూరు, నరసరావుపేట, తాడేపల్లి పట్టణ ప్రాంతాల్లో నమోదైనవే. ఈ మూడు పట్టణాలు హాట్ స్పాట్ లుగా మారిపోయాయి. లాక్ డౌన్ ఆంక్షలు భారీగా సడలించడంతో వైరస్ మరింతగా విస్తరిస్తోంది.. జిల్లాలో బుధవారం సాయంత్రం వరకు 1,074 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 5,810 సేకరించిన స్వాబ్ ల ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. పాజిటివ్ కేసులు చూస్తే ఒక్క గుంటూరులోనే 398, నరసరావుపేటలో 225, తాడేపల్లిలో 122 నమోదయ్యాయి. గుంటూరులో నిత్యం 20కి పైగే కేసులు నమోదు అవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరిగే కొద్ది రికవరీ రేటు పడిపోతున్నది. మొదట్లో రికవరీ రేటు 70 నుంచి 80శాతం మధ్య ఉండగా ప్రస్తుతం 53.72 శాతానికి పరిమితమయింది. 

Updated Date - 2020-06-25T16:20:28+05:30 IST