గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు

ABN , First Publish Date - 2020-06-21T09:35:37+05:30 IST

గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత ఎం.ధారునాయక్‌

గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు

రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌  ధారునాయక్‌


గుంటూరు, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత ఎం.ధారునాయక్‌ ఆరోపించారు. జీవో నెం.3 రిజర్వేషన్‌ పునరుద్ధరించాలని, దీనిపై వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిట్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ద్యారా సంక్రమించిన ప్రత్యేక రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రద్దు చేయడంతో గిరిజన నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రమైన ఆందోళనకు గురిచేసిందన్నారు.   కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మానుకొండ శివప్రసాద్‌, గిరిజన నేతలు మేడా రామకృష్ణ, రాజా నాయక్‌, మునీంద్ర నాయక్‌, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-21T09:35:37+05:30 IST