అమరావతితోనే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు

ABN , First Publish Date - 2020-06-26T10:22:40+05:30 IST

అమరావతితోనే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు అని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు చెప్పారు. రాష్ట్ర పాలనంతా

అమరావతితోనే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు

191వ రోజు ఆందోళనలో రాజధాని రైతులు


గుంటూరు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): అమరావతితోనే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు అని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు చెప్పారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు చేస్తోన్న ఆందోళనలు గురువారానికి 191వ రోజుకు చేరాయి. 29 గ్రామాల రైతులు ఇంటింటా అమరావతి, అమరావతి వెలుగు కార్యక్రమాలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్‌ క్రిష్ణాయపాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం కింద సమావేశాలు నిర్వహించి ప్రసంగించారు.


ఆరు నెలల ఉద్యమం తర్వాత కూడా ప్రభుత్వం నిరంకుశ వైఖరితోనే ఉందన్నారు. లాక్‌డౌన్‌ తరువాత వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి వినూత్న నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అమరావతిని సాధించుకుంటామని తెలిపారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు బాగుండాలనే సదుద్దేశంతోనే రాజధానికి భూములను త్యాగం చేశామన్నారు. రైతులకు అన్యాయం చేస్తూ రాజ్యాంగాన్ని అగౌరపరిచేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని వాపోయారు. 

Updated Date - 2020-06-26T10:22:40+05:30 IST