సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి తరానిదే

ABN , First Publish Date - 2020-12-20T05:07:34+05:30 IST

సంస్కృతి సాంప్రదాయాలను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి తరానిదేనని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు.

సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి తరానిదే
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శివకుమార్‌

 ఎమ్మెల్యే శివకుమార్‌

తెనాలి అర్బన్‌. డిసెంబరు 19 : సంస్కృతి సాంప్రదాయాలను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి తరానిదేనని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. రెయిన్‌ బో ఫిల్మ్‌ సొసైటీ, తెనాలి చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డులోని వివేకానంద సెంట్రల్‌ స్కూల్‌లో చిల్డ్రన్‌ కల్చరల్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు తమకు నచ్చిన రంగంలో రాణించేలా కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ప్రోత్సహించేలా ఉండాలన్నారు. షార్ట్‌ ఫిల్మ్‌, క్లాసికల్‌, వెస్ట్రన్‌ డ్యాన్స్‌ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నాట్యమయూరి అవార్డు గ్రహీత దుర్గారాజేశ్వరి, పోకల లక్ష్మికుమారి, మల్లేశ్వరరావు, ఆదినారాయణలను సన్మానించారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు గుత్తా వెంకటరత్నం, వీరనారాయణ, శివరామకృష్ణ, ఈదర పూర్ణచంద్‌, మోహన్‌, బొల్లిముంత కృష్ణ పాల్గొన్నారు. 


Read more