నేడు, రేపు చింతామణి నాటకం శత వసంతోత్సవం

ABN , First Publish Date - 2020-12-12T05:10:38+05:30 IST

కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శని, ఆదివారాలు చింతామణి నాటకం శత వసంతోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళల కాణాచి సంస్థ అధ్యక్షులు బుర్రా సాయిమాధవ్‌ తెలిపారు.

నేడు, రేపు చింతామణి నాటకం శత వసంతోత్సవం
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున సాయిమాధవ్‌

తెనాలి టౌన్‌, డిసెంబరు 11: కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శని, ఆదివారాలు చింతామణి నాటకం శత వసంతోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళల కాణాచి సంస్థ అధ్యక్షులు బుర్రా సాయిమాధవ్‌ తెలిపారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో చెరుకుమల్లి సింగారావు, జానీబాషా, కేశవరావు, ఎంపీ కన్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:10:38+05:30 IST