బదిలీల్లో అన్ని ఖాళీలను చూపాలి

ABN , First Publish Date - 2020-12-11T06:01:01+05:30 IST

బదిలీల్లో న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, బ్లాక్‌ చేయకుండా అన్ని ఖాళీలు చూపాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చైర్మన్‌ బసవలింగారావు డిమాండ్‌ చేశారు

బదిలీల్లో అన్ని ఖాళీలను చూపాలి
డిఇవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఫ్యాప్టో నాయకులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు

 వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు చేసే వరకు పోరాటం

డీఈవో కార్యాలయ ముట్టడిలో ఫ్యాప్టో నాయకుల డిమాండ్‌


గుంటూరు(విద్య), డిసెంబరు 10: బదిలీల్లో న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని,  బ్లాక్‌ చేయకుండా అన్ని ఖాళీలు చూపాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చైర్మన్‌ బసవలింగారావు డిమాండ్‌ చేశారు. గురువారం ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు.   ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ వెబ్‌కౌన్సెలింగ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ  ఉద్యమానికి అండగా ఉంటామన్నారు. ఖాళీలు బ్లాక్‌ చేయడం తగదన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జోసెఫ్‌ సుధీర్‌బాబు, కో చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, రామచంద్రయ్య, ఫైజుల్లా, రవికుమార్‌, కోశాధికారి వీరాంజనేయులు, డిప్యూటీ జనరల్‌ సెక్రటరి మేకల సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు నాగమల్లేశ్వరరావు, పెదబాబు  పాల్గొన్నారు.  కార్యాలయ ముట్టడికి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావడంతో నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంపాలెం స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు. 

Updated Date - 2020-12-11T06:01:01+05:30 IST