అమరావతి రైతులకు సంఘీభావం
ABN , First Publish Date - 2020-12-17T06:20:14+05:30 IST
అమరావతి ఉద్యమం బుధవారం నాటికి 364 రోజులు అయిన సందర్భంగా రైతులకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, తాలుకా సెంటర్‌లో ధర్నా జరిగింది.

సత్తెనపల్లి, డిసెంబరు 16: అమరావతి ఉద్యమం బుధవారం నాటికి 364 రోజులు అయిన సందర్భంగా రైతులకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, తాలుకా సెంటర్‌లో ధర్నా జరిగింది. ధర్నాలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, చౌటా శ్రీనివాసరావు, నర్శేటి వేణుగోపాల్, కొమ్మిశెట్టి సాంబశివరావు, దివ్వెల శ్రీనివాసరావు, చంద్రపాల్ తదితరులు మాట్లాడుతూ అమరావతినే రాజధానిగా ప్రకటించాలన్నారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని, ఆగిపోయిన అభివృద్ధిపనులు పూర్తి చేయాలన్నారు. ర్యాలీలో ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి, జైజై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ యెలినేటి రామస్వామి, భీమినేని వందనాదేవి, ఆళ్ల సాంబయ్య, పోట్ల ఆంజనేయులు, రావిపాటి మధుబాబు, దాసరి జ్ఞాన్ రాజ్‌పాల్, ఎల్.రవి, దేవేంద్రరావు, నర్శేటి తాండవకృష్ణ, శారద, జువ్వాజి రామ్మోహనరావు, కె. శ్రీనివాస్, శ్రీనివాసరావు, మన్నెం వెంకటరామయ్య, తదితరులు పాల్గొన్నారు.