టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
ABN , First Publish Date - 2020-11-13T06:42:53+05:30 IST
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళగిరి పట్టణంలో గురువారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, సలాం కుటుంబ సభ్యులకు నివాళులర్పించారు.
మంగళగిరి క్రైమ్, నవంబరు 12: అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళగిరి పట్టణంలో గురువారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, సలాం కుటుంబ సభ్యులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామర్ల శివరామరాజు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, నందం అబద్దయ్య, కె.అంకమ్మరావు, జ్యోతిబసు, మైనార్టీ నాయకులు షేక్ రియాజ్, ఎండీ ఇబ్రహీం, పఠాన్ ఖాసింఖాన్, షేక్ నాగుల్ మీరా, హుస్సేన్, అమీర్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
దుగ్గిరాల: మండల గ్రామం చిలువూరులో టీడీపీ, మైనార్టీసెల్ నేతలు కొవ్వొత్తులతో గురువారం సాయంత్రం ప్రదర్శన నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం మృతికి నివాళులర్పిస్తూ చిలువూరులో టీడీపీ నేతలు కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు టి.సీతారామయ్య, షేక్ బాబు, జలాలుద్దీన్, నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.