రాజధాని ఉద్యమానికి అండగా నిలుద్దాం
ABN , First Publish Date - 2020-12-12T05:29:24+05:30 IST
అమరావతి కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న మహిళలు, రైతులకు అండగా నిలుద్దామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ నసీర్ పిలుపునిచ్చారు.
మహ్మద్ నసీర్
గుంటూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): అమరావతి కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న మహిళలు, రైతులకు అండగా నిలుద్దామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ నసీర్ పిలుపునిచ్చారు. గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన డివిజన్ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని ఉద్యమం ప్రారంభమై సంవత్సరం గడుస్తున్న సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహార్యాలీకి తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని డివిజన్ నేతలకు సూచించారు. సమావేశంలో కార్పొరేటర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.