ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2020-12-29T06:10:48+05:30 IST
నియోజకవర్గ పరిధిలోని ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు
కోవెలమూడి రవీంద్ర
గుంటూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధిలోని ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. ఇటీవల మరణించిన కృష్ణబాబు కాలనీకి చెందిన కార్యకర్త చిత్తలూరి రాంబాబు కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఏ అవసరం వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నేతలు కనపర్తి శ్రీనివాసరావు, ఖాదర్ భాషా, తన్నీరు కృష్ణ, కంచర్ల సాంబశివరావు, మస్తాన్‌వలి, మూర్తి, పోపూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.