-
-
Home » Andhra Pradesh » Guntur » tdp leader gv anjaneyulu guntur
-
వినుకొండ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ జీవీ ఆంజనేయులు
ABN , First Publish Date - 2020-12-10T18:29:53+05:30 IST
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూకబ్జాలకు పాల్పడుతున్నారని నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

గుంటూరు: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూకబ్జాలకు పాల్పడుతున్నారని నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని అన్నారు. ఎందుకు పనికి రాని తన వంద ఎకరాల పొలాన్ని అధిక ధరకు ప్రభుత్వానికి అంటగట్టారని మండిపడ్డారు. వీసి నరసింహ రెడ్డి భూమిని మోసం చేసి తక్కువ ధరకు కొట్టేశారని... అర్బన్ హౌసింగ్‌ని గాలికి వదిలేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.