దళితుల మధ్య చిచ్చుపెడుతున్న ఎంపీ సురేష్‌

ABN , First Publish Date - 2020-12-30T05:32:29+05:30 IST

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ సీఎం జగన్‌రెడ్డి ప్రాపకం కోసం దళితుల మధ్య చిచ్చుపెట్టి హత్యా రాజకీయాలకు శ్రీకారం చుడ్డారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు.

దళితుల మధ్య చిచ్చుపెడుతున్న ఎంపీ సురేష్‌

మరియమ్మ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు


గుంటూరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ సీఎం జగన్‌రెడ్డి ప్రాపకం కోసం దళితుల మధ్య చిచ్చుపెట్టి హత్యా రాజకీయాలకు శ్రీకారం చుడ్డారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాళ్లదాడిలో చనిపోయిన మరియమ్మ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎంపీకి దమ్ము, ధైర్యం ఉంటే దళిత పల్లెల్లో ఒక్కడే పర్యటిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు మేరకే రాజధానిలో అల్లర్లు సృష్టించటానికి ఎంపీ దిగజారి ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వ పెద్దలు దళితుల మధ్య గొడవలకు తెరలేపారని ఆరోపించారు. సమావేశంలో నేతలు కంచర్ల శివరామయ్య, సౌపాటి రత్నం, ముత్తిపోగు నాగేశ్వరరావు, బొబ్బిలి రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అవాస్తవాలు ప్రచరిస్తున్నారంటూ సీఎం జగన్‌ సొంత మీడియా ప్రతులను దగ్ధం చేశారు. 

Updated Date - 2020-12-30T05:32:29+05:30 IST