-
-
Home » Andhra Pradesh » Guntur » tdp
-
విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
ABN , First Publish Date - 2020-12-20T05:01:01+05:30 IST
ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని తెలుగు విద్యార్థి నేతలకు టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ సూచించారు.

తెనాలి శ్రావణ్‌కుమార్
గుంటూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని తెలుగు విద్యార్థి నేతలకు టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ సూచించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో టీఎన్‌ఎస్‌ఫ్ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ నేతృత్వంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ రాజకీయాల నుంచి ప్రపంచస్థాయి నేతగా ఎదిగిన చంద్రబాబు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నేతలు కంచర్ల శివరామయ్య, కల్లం రాజశేఖరరెడ్డి, మద్దిరాల గంగాధర్‌తో పాటు పెద్ద ఎత్తున టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు.