-
-
Home » Andhra Pradesh » Guntur » tdp
-
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు
ABN , First Publish Date - 2020-12-16T05:19:47+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిలిపేసి రాష్ట్రాన్ని అంశకారంలోకి నెట్టేసిందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ ఇన్‌చార్జి జీవీ ఆంజనేయులు విమర్శించారు.

జీవీ ఆంజనేయులు
గుంటూరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిలిపేసి రాష్ట్రాన్ని అంశకారంలోకి నెట్టేసిందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ ఇన్‌చార్జి జీవీ ఆంజనేయులు విమర్శించారు. మంగళవారం ఆయన అన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగి ఉంటే 13 జిల్లాలకు రూ.2 లక్షల కోట్ల సంపద సమకూరేదని వివరించారు. యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఇటీవల వచ్చిన వరదల్లో ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు మునిగినా అమరావతిలోకి చుక్కనీరు కూడా రాలేదన్నారు. 32శాతం మంది ఎస్సీ, ఎస్టీలు రాజధానికి భూములిచ్చారని తెలిపారు. రాజధానిలో నిజంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే ఏడాదిన్నర అవుతున్నా ఎందుకు నిరూపించలేకపోయారని నిలదీశారు. అమరావతి విధ్వంసంపై ప్రజలకు వివరించి జగన్‌ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతామని అన్నారు.