-
-
Home » Andhra Pradesh » Guntur » tdp
-
మంత్రి పెద్దిరెడ్డి దళితులకు క్షమాపణలు చెప్పాలి
ABN , First Publish Date - 2020-11-21T05:54:26+05:30 IST
మంత్రి పెద్దిరెడ్డి దళితులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

టీడీపీ నేతలు పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు
గుంటూరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మంత్రి పెద్దిరెడ్డి దళితులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాణిక్యరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై దాడులు చేపిస్తున్న వైసీపీ ప్రభుత్వం, నేడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామిని కుల అహంకారంతో దూషించటం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల కమిషనర్‌ను దూషించిన కొడాలి నానిని వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికలకు భయపడుతున్న సీఎం జగన్ కరోనాను సాకుగా చూపటం.. ఓటమిని పరోక్షంగా అంగీకరించటమేనన్నారు. నాడు - నేడు అంటూ భారీ ర్యాలీలు చేసిన వైసీపీ నేతలకు కరోనా అడ్డురాలేదా అంటూ కనసర్తి ప్రశ్నించారు.