తారాజువ్వ రగడ ఒకరి ప్రాణం తీసింది!

ABN , First Publish Date - 2020-11-26T04:17:25+05:30 IST

దీపావళి రోజున పేల్చిన తారాజువ్వ పక్కవీధిలోని వృద్ధురాలిపై పడి చీర కాలిపోవడంతో అదికాస్త మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు.

తారాజువ్వ రగడ ఒకరి ప్రాణం తీసింది!
మృతి చెందిన నాగభూషణం

రాజుపాలెం, నవంబరు 25: దీపావళి రోజున పేల్చిన తారాజువ్వ పక్కవీధిలోని వృద్ధురాలిపై పడి చీర కాలిపోవడంతో అదికాస్త మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని గణపవరానికి చెందిన మాటా నాగభూషణం (40) రంగు కోడిపిల్లలు అమ్ముకొని జీవనం సాగించేవాడు. దీపావళి పండుగ రోజున అతని కుమారుడు వేంకటేశ్వర్లు బాణసంచా కాల్చాడు. ఈ సందర్భంగా తారాజువ్వ రవ్వలు పక్కవీధిలోని ఓ వృద్ధురాలిపై పడి చీరకాలడంతో రెండువర్గాల మధ్య అప్పటి నుంచి గొడవ జరుగుతూనే వుంది. మంగళవారం వృద్ధురాలి కోడలు వచ్చి వేంకటేశ్వర్లుపై గొడవకు దిగింది. ఈక్రమంలో ఇరువర్గాలమధ్య గొడవ తీవ్రమవడంతో  నాగభూషణంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నాగభూషణంలో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు వేంకటేశ్వర్లు ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more