నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2020-12-30T05:13:57+05:30 IST

రాష్ట్రంలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసుబాబు మాదిగ మండిపడ్డారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి
అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ నాయకులు

స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా

గుంటూరు(తూర్పు), డిసెంబరు 29: రాష్ట్రంలో  దళితులపై వరుస దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసుబాబు మాదిగ మండిపడ్డారు. అనంతపురంలో దళిత యువతిని హత్యచేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ  మంగళవారం సంఘం ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులను శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మక్కెన ప్రభాకర్‌, నగర అధ్యక్షుడు గుడూరు ఎజ్రామాదిగ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:13:57+05:30 IST