-
-
Home » Andhra Pradesh » Guntur » SUICIDE
-
హెచ్‌ఐవీ సోకిందని గొంతుకోసుకుని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-31T05:28:31+05:30 IST
పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన ఓ వ్యక్తి తనకు హెచ్‌ఐవీ సోకిందని గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు త్రీ టౌన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.

తెనాలి రూరల్, డిసెంబరు 30: పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన ఓ వ్యక్తి తనకు హెచ్‌ఐవీ సోకిందని గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు త్రీ టౌన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. లారీ డ్రైవర్‌గా పని చేసే ఇతడికి ఇటీవల హెచ్‌ఐవీ సోకింది. అప్పటి నుంచి మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయం బయటివారికి తెలిస్తే తలెత్తుకుని తిరగలేమని మధనపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో కత్తిపీటతో మెడను కోసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న అతడిని కుటుంబసభ్యులు గుర్తించి జిల్లా ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. చికిత్ర పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.