కాలువలో జారిపడి విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2020-12-28T05:36:38+05:30 IST

మండలంలోని వెల్లటూరు శివారు సీతారామ్‌పురం తండాకు చెందిన మీరాదోస్త్‌ అంజిబాబు నాయక్‌(16) ప్రమాదవశాత్తు కాలువలోపడి ప్రమాద మృతి చెందాడు.

కాలువలో జారిపడి విద్యార్థి మృతి

బొల్లాపల్లి, డిసెంబరు 27: మండలంలోని వెల్లటూరు శివారు సీతారామ్‌పురం తండాకు చెందిన మీరాదోస్త్‌ అంజిబాబు నాయక్‌(16) ప్రమాదవశాత్తు కాలువలోపడి ప్రమాద మృతి చెందాడు. అంజిబాబు మార్కాపురం నవోదయ రెసిడెన్షియల్‌లో టెన్త్‌ చదువుతూ లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం సమీపంలోని ఎన్‌ఎస్‌పీ సాగర్‌ మెయిన్‌ కెనాల్‌ వైపు బహిర్భూమికి వెళ్ళి కాలువలో పడి మృతి చెందాడు. 


Updated Date - 2020-12-28T05:36:38+05:30 IST