ఎస్‌ఎస్‌ఏలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
ABN , First Publish Date - 2020-07-19T16:47:37+05:30 IST
జిల్లా సమగ్ర శిక్షా అభియాన్‌లో..

గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్ర శిక్షా అభియాన్‌లో ఖాళీగా ఉన్నపోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు ప్రాజెక్టు ఆఫీసర్ పి.రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 24న విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఎంఐఎస్, ప్రత్యేక అవసరాల విద్య, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ అల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్, ప్రత్యేక అవసరాల విద్య అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు smagrasikshaguntur.blogspot.com అనే వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు