జగన్‌ ప్రభుత్వం క్రైస్తవులను విస్మరిస్తోంది

ABN , First Publish Date - 2020-12-19T05:47:54+05:30 IST

వైసీపీ 18 నెలల పాలనలో క్రైస్తవులకు ఒరిగిందేమీ లేదని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు.

జగన్‌ ప్రభుత్వం క్రైస్తవులను విస్మరిస్తోంది
సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీనేతలు శ్రావణ్‌ కుమార్‌, మ్యానీ, మానుకొండ తదితరులు

 తెనాలి శ్రావణ్‌ కుమార్‌


గుంటూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ 18 నెలల పాలనలో క్రైస్తవులకు ఒరిగిందేమీ లేదని  టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 56 బీసీ కార్పొరేషన్లు వేశామని గొప్పగా చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి జగన్‌ క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌ ఎందుకు వేయలేదని నిలదీశారు. క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల జోసఫ్‌ ఇమ్యానియల్‌ (మ్యానీ) మాట్లాడుతూ రాజకీయ రిజర్వేషన్లలో బీసీలకు 33శాతం నుంచి 24శాతానికి కుదించడం వల్ల బీసీలు పదవులు కోల్పోయారని అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సెమీ క్రిస్మస్‌ వేడులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నేతలు మానుకొండ శివప్రసాద్‌, చిట్టాబత్తిని చిట్టిబాబు, బొల్లెద్దు సుశీల్‌రావు, గుడిమెట్ల దయారత్నం, నక్కల అగస్టీన్‌, తలతోటి సరేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T05:47:54+05:30 IST