జగన్‌ తీరుతో ఘోషిస్తోన్న అంబేద్కర్‌ ఆత్మ

ABN , First Publish Date - 2020-11-27T05:18:49+05:30 IST

సీఎం జగన్‌ తీరుతో మహనీయుడు అంబేద్కర్‌ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

జగన్‌ తీరుతో ఘోషిస్తోన్న అంబేద్కర్‌ ఆత్మ

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ తీరుతో మహనీయుడు అంబేద్కర్‌ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  రాష్ట్రంలో 18 నెలలు రాజ్యాంగం సంక్షోభంలో పడిందన్నారు. నియంత పాలనకు పెద్ద కొడుకుగా జగన్‌ నిలుస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ఫై ఏమాత్రం అభిమానం ఉన్నా అమరావతిలోని స్మృతి వనం పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు జగన్‌రెడ్డి అహంకారానికి గురవుతున్నారన్నారు. 

Updated Date - 2020-11-27T05:18:49+05:30 IST