ఈకేవైసీ మెలిక! లక్షా 39 వేల రేషన్‌కార్డుల ముద్రణ పెండింగ్‌

ABN , First Publish Date - 2020-03-12T07:24:35+05:30 IST

ఈకేవైసీ జరగని కారణంగా జిల్లాలో లక్షా 39 వేల బియ్యం కార్డుల ప్రింటింగ్‌ పెండింగ్‌లో పడింది. ఆయా కార్డుల్లోని కుటుంబ పెద్దల s

ఈకేవైసీ మెలిక!  లక్షా 39 వేల రేషన్‌కార్డుల ముద్రణ పెండింగ్‌

 గతంలో ఫొటో లేకుండా జారీ చేసిన  టీఏపీ సీరియల్‌ కార్డులు

 ఆయా కుటుంబాలకు ఈకేవైసీ చేయిస్తేనే కార్డుల ముద్రణకు అవకాశం

 వలంటీర్లతో ప్రత్యేక డ్రైవ్‌   నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశం

గుంటూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఈకేవైసీ జరగని కారణంగా జిల్లాలో లక్షా 39 వేల బియ్యం కార్డుల ప్రింటింగ్‌ పెండింగ్‌లో పడింది. ఆయా కార్డుల్లోని కుటుంబ పెద్దల ఈకేవైసీ జరగని కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. వీటిల్లో ఎక్కువగా టీఏపీ సీరియల్‌తో ప్రారంభమయ్యే కార్డులున్నాయి. వీటికి గతంలో కుటుంబ ఫొటో లేకుండానే తాత్కాలికంగా కార్డులు పంపిణీ చేశారు. ఈ కారణంగానే వాటి ముద్రణని ప్రభుత్వం నిలిపేసింది. సాధ్యమైనంత త్వరగా ఆయా కుటుంబాల ఇళ్లకు వలంటీర్లను పంపించి కుటుంబ పెద్దతో ఈకైవేసీ చేయించి ఆ వివరాలను అప్‌లోడింగ్‌ చేయాలని ఆదేశించింది. అప్పటివరకు ఆయా కార్డుల ముద్రణ చేసేది లేదని పేర్కొన్నది. దీంతో వలంటీర్లతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. వలంటీర్లతో పాటు రేషన్‌డీలర్లకు కూడా ఈకేవైసీ చేసే  అవకాశం కల్పిస్తే ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి అవుతుందన్న భావన వ్యక్తమౌతోన్నది. 

జిల్లాలో 14 లక్షల రేషన్‌కార్డులుండగా ఇప్పటికే 10.90 లక్షల కార్డుల ముద్రణ పూర్తి అయి పౌరసరఫరాల అధికారి కార్యాలయానికి విజయవాడ నుంచి వచ్చాయి. వాటిని సీఎస్‌డీటీల ద్వారా గ్రామ/వార్డు సచివాలయాలకు తరలించి అక్కడ వలంటీర్లకు ఇచ్చి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయిస్తోన్నారు. రూరల్‌ మండలంతో కలిపి గుంటూరు నగరంలో లక్షా మూడు వేల కార్డులుండగా ఇప్పటికే 79 వేల కార్డుల ముద్రణ పూర్తి అయి పంపిణీని ప్రారంభించారు. ఇదిలావుంటే ఆర్‌ఏపీ సీరియల్‌తో ఉన్న కార్డుల ముద్రణ ఆగిపోయింది. ఇవి ప్రింటింగ్‌ జరగాలంటే వలంటీర్లు సంబంధిత ఇళ్లకు వెళ్లి కుటుంబ పెద్దతో బయోమెట్రిక్‌ యంత్రంలో వేలిముద్ర వేయించి ఆ వ్యక్తి ఫోటోని సేకరించాలి. ఈ నెలాఖరు లోపే రేషన్‌కార్డుల పంపిణీ పూర్తి కావాల్సి ఉండగా ఇంకా జిల్లాలో ఇంత పెద్ద సంఖ్యలో అసలు కార్డులే ముద్రణ జరగకపోవడం ఆందోళన కలిగిస్తోన్నది. 

మరోవైపు అనర్హుల జాబితాలో ఉన్న కుటుంబాలో చాలా మంది అభ్యంతరం పెట్టగా వారిలో కొద్దిమందివే బియ్యం కార్డుల పునరుద్ధరణ జరిగింది. మరోవైపు అసలు అభ్యంతరం పెట్టని వారివి రైస్‌కార్డుల ముద్రణకు పంపించారు. రేషన్‌కార్డుల్లో చేర్పులు, తొలగింపులకు సిస్టమ్‌లో గ్రామ పరిపాలన కార్యదర్శుల ద్వారా అప్‌లోడింగ్‌ చేయించారు. వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.  గతంలో యూఐడీ సీడింగ్‌లో జరిగిన తప్పులను చాలామంది సరి చేయించుకోగా ఇప్పుడు మళ్లీ పాత తప్పులే పునరావృతం అవుతోండటంతో ఆయా కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్నాయి.


Updated Date - 2020-03-12T07:24:35+05:30 IST