-
-
Home » Andhra Pradesh » Guntur » sendriya sagu
-
సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు
ABN , First Publish Date - 2020-12-20T05:03:04+05:30 IST
మిర్చిపంటలో సేంద్రియ సాగు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరతాయని ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి అన్నారు.

ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి
క్రోసూరు, తాడికొండ, డిసెంబరు 19: మిర్చిపంటలో సేంద్రియ సాగు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరతాయని ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి అన్నారు. మండలంలోని 88 తాళ్ళూరులో సేంద్రియ పద్ధతిలో సాగువుతున్న మిర్చి పంటను శనివారం ఆయన పరిశీలించారు. తాడికొండ మండలం కంతేరులో చీడ పీడల నివారణకు డ్రోన్ ద్వారా క్రిమిసంహారాలను పిచికారి చేసే విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాళ్లూరులో గ్రామంలో మూడు వందల ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో మిర్చి పంటలు పండిస్తున్నట్టు ఆయన చెప్పారు. రైతులకు కావాల్సిన సేంద్రియ ఎరువులు, పురుగు మందులను ఆయన అందజేశారు. ఆయనతో పాటు ఉద్యానశాఖ డైరెక్టర్ ధర్మజ, అసిస్టెంట్ డైరెక్టర్ బెన్ని, డిప్యూటీ డైరెక్టర్ సుజాత, డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.