విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
ABN , First Publish Date - 2020-11-14T04:22:12+05:30 IST
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్‌బీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని 40 స్కూళ్లలో 4,100మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు ఇతర వస్తువులను పంపిణీ చేశారు.
గుంటూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్‌బీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని 40 స్కూళ్లలో 4,100మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు డొంకరోడ్డులో ఎస్‌బీఐ సీజీఎం సంజయ్ సహాయ్ ప్రారంభించారు. అధ్యక్షత వహించిన రీజనల్ మేనేజర్ ఎంవీవీఎం కృష్ణ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి 850 పీపీఈ కిట్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం షేక్ జాన్‌డేనియల్, బ్యాంక్ అధికారులు ఎల్.సత్యన్నారాయణ, ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.