రోడ్డు ప్రమాదంలో సెంట్రింగ్‌ మేస్ర్తి మృతి

ABN , First Publish Date - 2020-12-16T05:07:59+05:30 IST

రోడ్డు ప్రమాదంలో సెంట్రింగ్‌ మేస్ర్తి మృతిచెందిన ఘటన మండలంలోని అబ్బూరు వద్ద మంగళవారం రాత్రి జరిగింది.

రోడ్డు ప్రమాదంలో సెంట్రింగ్‌ మేస్ర్తి మృతి

సత్తెనపల్లి రూరల్‌, డిసెంబరు 15: రోడ్డు ప్రమాదంలో సెంట్రింగ్‌ మేస్ర్తి మృతిచెందిన ఘటన మండలంలోని అబ్బూరు వద్ద మంగళవారం రాత్రి జరిగింది. సత్తెనపల్లి పట్టణంలోని రంగాకాలనీకి చెందిన సత్తెనపల్లి శివనాగేశ్వరరావు(33) ద్విచక్రవాహనంపై ఫణిధం వైపు నుంచి సత్తెనపల్లి వస్తుండగా అబ్బూరు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు రాగానే అబ్బూరు వైపు వెళుతున్న ఆటో ఢీకొంది. ప్రమాదంలో శివనాగేశ్వరరావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి ప్రమాద తీరును పరిశీలించి వివరాలు సేకరించారు.  ఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌వీ సురేష్‌ చెప్పారు.  

Updated Date - 2020-12-16T05:07:59+05:30 IST