కళాకారులకు సత్కారం సామాజిక బాధ్యత

ABN , First Publish Date - 2020-11-14T03:57:46+05:30 IST

కళాకారులను సత్కరించటం సామాజిక బాధ్యత అని శాస్త్రవేత్త డాక్టర్‌ చందు సాంబశివరావు పేర్కొన్నారు.

కళాకారులకు సత్కారం సామాజిక బాధ్యత
రచయిత్రిని సత్కరిస్తున్న చందు సాంబశివరావు, రంగరాజు తదితరులు

శాస్త్రవేత్త చందు సాంబశివరావు

గుంటూరు, నవంబరు 13: కళాకారులను సత్కరించటం  సామాజిక బాధ్యత అని శాస్త్రవేత్త డాక్టర్‌ చందు సాంబశివరావు పేర్కొన్నారు. అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాల సమావేశ మందిరంలో పినాకిని యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమగ్ర గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వివిధ సాహిత్య, సేవ, సాంస్కృతిక కళారంగాలలో విశేష కృషి చేసిన ప్రతిభావంతులకు అమృతమూర్తి జాతీయ సేవా పురస్కారాలు  అందజేశారు. మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్‌యాదవ్‌, బీజేపీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు, జిల్లా యువజన సర్వీసుల అధికారి డాక్టర్‌ వి.శ్రీనివాసరావు, కొవిడ్‌ సెంటర్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ లక్ష్మణ్‌నాయక్‌, స్పందన ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఈద శామ్యూల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-14T03:57:46+05:30 IST