26న జరిగే సమ్మెను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2020-11-22T04:26:16+05:30 IST
కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 26వతేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
గుంటూరు(తూర్పు), నవంబరు 21: కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 26వతేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం అవ్వాలని కోరుతూ శనివారం శంకర్‌విలాస్ సెంటర్‌లో కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో పీఎస్ శేఖర్‌రెడ్డి, వీవీకే సురేష్, కోటా మాల్యాద్రి, కె.శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు, మస్తాన్‌వలి, అరుణ్‌కుమార్, షకీలా తదితరులు పాల్గొన్నారు.