సాయానికి సలాం
ABN , First Publish Date - 2020-04-08T10:33:17+05:30 IST
కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 7: కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. లాక్డౌన్ సమయంలో తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు విరాళాలు అందజేస్తున్నారు. అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను మంగళగిరి మండలం ఆత్మకూరులో రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత మంగళవారం ప్రారంభించారు.
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, లలితా రైస్ బ్రాండ్ రైస్, ఇన్ఫోసి్సల సహకారంతో జిల్లాలోని పద్నాలుగు మండలాల్లో నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్లు అక్షయపాత్ర నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి సలహాదారు అజేయకల్లం, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, కనెక్ట్ టూ ఆంధ్రా సీఈవో వి.కోటేశ్వరమ్మ, అక్షయపాత్ర వంశీధరదాసా తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని షరాఫ్ బజారులో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
గుంటూరులోని అమరావతి రోడ్డులో జ్వరాల ఆసుపత్రి వద్ద మనతారం హ్యూమన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు. మల్లికార్జునపేట శంకరశెట్టి మాలతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిరాశ్రుయులకు గుడ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. జిల్లా ఎరువులు, పురుగు మందుల వ్యాపారులు ముఖ్యమంత్రి సహాయ నిధికి మంగళవారం రూ.40వేలు చెక్కు అందజేశారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ జాతీయ వినియోగదారుల సంఘం నాయకుడు చదలవాడ హరిబాబు కరపత్రాలు పంచి పెట్టారు. జీజీహెచ్‌లో వైద్యులు, సిబ్బందికి డీసీసీబీ పాలకవర్గ సభ్యుడు పెదకూరపాడు బుజ్జి యాప్రాన్ల కిట్లను అందజేశారు.
నగరంపాలెం ఎస్వీఎన్ఆర్ రెడ్డి హాస్టల్ పాలకవర్గం నగరంలోని 800 మంది పేదలకు అన్నదానం నిర్వహించింది. సెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కేవీపీ కాలనీ, మహాత్మాగాంధీ కాలనీలో ఆహారం, తాగునీరు, మాస్కులు పంపిణీ చేశారు. పేదలకు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. మిర్చియార్డు సమీపంలోని దుర్గానగర్‌లో గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, తహశీల్దార్ మోహన్‌రావు, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు మాణిక్యరావు, వీరభద్రం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులోని పలు ప్రాంతాల్లో కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 20వ డివిజన్ పరిధిలో నల్లచెరువులో కావటి వైసీపీ నేత కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెలల్యే మద్దాళిగిరి, వైసీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు 3వేల కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.
శారదాకాలనీకి చెందిన సాల్వేషన్ ఆర్మీ సంస్థ ప్రతినిధి జి.మోజేస్ ఆధ్వర్యంలో 150 మందికి మంగళవారం పండ్లు, ఆహారం అందజేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో పోలీసులు, పారిశుద్ద్య కార్మికులకు పండ్లు, డ్రింక్స్ ప్యాకెట్లు పంపిణీ చే శారు. విజయవాడలో 5వేల మంది పోలీసులకు డాక్టర్ ఓవీ రమణ హోమియో మందులు పంపిణీ చేశారు. రూ.లక్షను డాక్టర్ రమణ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు అందజేశారు.
భాష్యం.. అన్నదానం
లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో అన్నార్తులకు ఆక లి తీర్చటానికి భాష్యం విద్యా సంస్థలు తమ వంతు సహాయాన్ని అం దిస్తున్నాయి.ఈనెల ఒకటోతేదీ నుంచి అరండల్‌పేట పార్క్ సెంటర్, ఏసీ కళాశాల సెంటర్లో రోజువారీ కూలీలు, అన్నార్తులకు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈనెల 14వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు.
కళ్ళం గ్రూప్స్.. రూ.25 లక్షల విరాళం
కరోనా విపత్తు నేపఽథ్యంలో జిల్లాకు చెందిన కళ్ళం గ్రూప్స్ రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో చెక్కును కళ్ళం గ్రూప్స్ అధినేత కళ్ళం హరనాథరెడ్డి, డైరెక్టర్ కళ్ళం మోహన్‌రెడ్డి అందజేశారు.