సాయిమాధవ్‌కు గోపరాజు పురస్కారం
ABN , First Publish Date - 2020-11-14T04:37:47+05:30 IST
సామాజిక సమస్యల దృశ్యరూపాలే నాటికలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు.
తెనాలి రూరల్, నవంబరు 13: సామాజిక సమస్యల దృశ్యరూపాలే నాటికలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మండలంలోని ఖాజీపేటలో దీపావళిని పురస్కరించుకుని కొలంకపురి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనకు శుక్రవారం ఎమ్మెల్యే శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తలుపులు తెరిచి ఉన్నాయి, భూమి దుఖం నాటికలు ప్రదర్శించారు. అనంతరం రంగస్థల, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌కు గోపరాజు శివరామ సుభ్రహ్మణ్యశర్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. కమిటీ సభ్యులు గోపరాజు వెంకటరమణ, విజయ్, ఏపీఆర్ శర్మ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.