సహకార సంఘాలను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2020-11-16T03:56:59+05:30 IST

సహకార సంఘాలను బతోపేతం చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌ లాలుపురం రాము అన్నారు.

సహకార సంఘాలను బలోపేతం చేయాలి
జెండాను ఎగురవేస్తున్న డీసీసీబీ చైర్మన్‌ రాము

సహకార సంఘాలను బలోపేతం చేయాలి


గుంటూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాలను బతోపేతం చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌ లాలుపురం రాము అన్నారు. గుంటూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం సహకార వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు సహకార అభివృద్ధి, ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. సీసీవో కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీవో రాజశేఖర్‌, ఓస్‌డీ విజయ లక్ష్మి, జీఎం భాను తదితరులు పాల్గొన్నారు.


డీసీఎంఎస్‌లో..

గుంటూరులోని డీసీఎంఎస్‌ ప్రధాన కార్యాలయంలో డీసీవో రాజశేఖర్‌ అధ్యక్షతన ఆదివారం సహకార వారోత్సవాలను నిర్వహించారు. చైర్మన్‌ క్రిస్టినా సహకార జెండాను ఆవిష్కరించగా, సహకార విద్యాధికారి వేదాతంరెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. జీఎం హరగోపాలం, బీఎం శ్రీవాసరావు, ఐపీఎల్‌ జిల్లా మేనేజర్‌ కె.మధు, కె.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.



 డీసీవో కార్యాలయంలో...

కలెక్టరేట్‌లోని జిల్లా, గుంటూరు డివిజనల్‌ సహకార కార్యాలయాల్లో సహకార వారోత్సవాలను ప్రారంభించారు. జిల్లా కార్యాలయంలో డీసీవో రాజశేఖర్‌, డివిజినల్‌ కార్యాలయంలో డీఆర్‌ రాజేశ్వరరావు జెండాను ఎగురవేశారు. ఏవో నాగశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-16T03:56:59+05:30 IST