సాగర్ నీటి సమాచారం
ABN , First Publish Date - 2020-12-08T05:27:06+05:30 IST
నాగార్జున సాగర్ నీటిమట్టం సోమవారం నాటికి 588.60 అడుగులు ఉంది. ఇది 307.87 టీఎంసీలకు సమానం.

విజయపురిసౌత్, డిసెంబరు 7: నాగార్జున సాగర్ నీటిమట్టం సోమవారం నాటికి 588.60 అడుగులు ఉంది. ఇది 307.87 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 600 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 8,144, ఎడమకాలువ ద్వారా 2,980, మొత్తం 11,724 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో వాటర్‌గా 11,724 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 880.70 అడుగులుంది. ఇది 191.65 టీఎంసీలకు సమానం.