కౌలు రైతులకు రుణాలివ్వాలంటూ ధర్నా

ABN , First Publish Date - 2020-11-21T06:10:03+05:30 IST

సక్రమంగా రుణాలు చెల్లిస్తున్న కౌలు రైతులందరికీ రుణాలివ్వాలని కోరుతూ దుగ్గిరాల మండలం పెదపాలెంలోని బ్యాంక్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.

కౌలు రైతులకు రుణాలివ్వాలంటూ ధర్నా
దుగ్గిరాల మండలం పెదపాలెంలో బ్యాంకు ఎదుట ధర్నాకు దిగిన కౌలు రైతు సంఘ నాయకులు

దుగ్గిరాల, నవంబరు 20: సక్రమంగా రుణాలు చెల్లిస్తున్న కౌలు రైతులందరికీ రుణాలివ్వాలని కోరుతూ దుగ్గిరాల మండలం పెదపాలెంలోని బ్యాంక్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. బ్యాంకు అధికారులు కౌలు రైతులకు రుణాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తక్షణమే రుణాలివ్వాలంటూ నినాదాలు చేస్తూ బ్యాంక్‌ ఎదుట మహిళలు రైతులతో కలిసి ధర్నాకు దిగారు.  ధర్నాలో ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతు సంఘ నాయకుడు పి.జమలయ్య మాట్లాడుతూ, 15ఏళ్లుగా జేఎల్‌జీ గ్రూపులు పంట రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా ఈ ఏడాది నిబంధనల పేరుతో రుణాలను ఇవ్వలేదన్నారు. 15 రోజుల క్రితం తాము రైతులకు రుణాలివ్వాలని వినతిపత్రం సమర్పించామని, తమ అభ్యర్థనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్‌ఐ ప్రతా్‌పకుమార్‌ బ్యాంకు వద్దకు చేరుకుని కౌలురైతు సంఘ నేతలు, బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడారు. మన్నవ నాగమల్లేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, విజయలక్ష్మి, పరశురామారావు, అమ్మిరెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు.


Read more