నేటి నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సు

ABN , First Publish Date - 2020-12-11T06:19:06+05:30 IST

గుంటూరు నుంచి వయా మీర్యాలగూడ మీదగా హైదరాబాద్‌కు ఆర్టీసీ ఏసీ అమరావతి సర్వీసు శుక్రవారం రాత్రి 10-30 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్‌ఎం రాఘవకుమార్‌ తెలిపారు.

నేటి నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సు

గుంటూరు, డిసెంబరు 10: గుంటూరు నుంచి వయా మీర్యాలగూడ మీదగా హైదరాబాద్‌కు ఆర్టీసీ ఏసీ అమరావతి సర్వీసు శుక్రవారం రాత్రి 10-30 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్‌ఎం రాఘవకుమార్‌ తెలిపారు. ఈ సర్వీసు గుంటూరు బస్టాండ్‌ నుంచి శంకర్‌విలాస్‌ సెంటర్‌ మీదుగా లక్ష్మీపురం, పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ మీదగా హైదరాబాద్‌ కూకట్‌పల్లి వరకు వెళుతుందన్నారు. కూకట్‌పల్లిలో తిరిగి రాత్రి 10-30 గంటలకు గుంటూరు బయల్దేరుతుందన్నారు. విజయవాడ రూట్‌ కన్నా రూ.85 తక్కువ ఛార్జీతో పాటు గంట తక్కువ సమయంలోనే హైదరాబాద్‌ చేరుకోవచ్చని తెలిపారు.  

  

Updated Date - 2020-12-11T06:19:06+05:30 IST