క్రషర్‌ లారీ ఢీకొని గాల్లోకి లేచిన కారు

ABN , First Publish Date - 2020-12-26T05:16:42+05:30 IST

పెను ప్రమాదం త్రుటిలో తప్పింది, లారీ మితిమీరిన వేగంతో దూసుకు వచ్చి ముందు వెళుతున్న కారును ఢీకొనటంతో కారు గాలిలోకి లేచి డివైడర్‌పైనున్న విద్యుత్‌ పోలుకు తగిలి మళ్లీ రోడ్డుపై పడింది.

క్రషర్‌ లారీ ఢీకొని గాల్లోకి లేచిన కారు

విద్యుత్‌ పోలుకు తగిలి కింద పడినవైనం

ఫ ఆరుగురికి తీవ్ర గాయాలు

గుంటూరు (సంగడిగుంట), డిసెంబరు 25: పెను ప్రమాదం త్రుటిలో తప్పింది, లారీ మితిమీరిన వేగంతో దూసుకు వచ్చి ముందు వెళుతున్న కారును ఢీకొనటంతో కారు గాలిలోకి లేచి డివైడర్‌పైనున్న విద్యుత్‌ పోలుకు తగిలి మళ్లీ రోడ్డుపై పడింది. కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు సైతం బెంబేలెత్తారు వివరాల్లోకి వెళితే... ఉప్పలపాడు గ్రామానికి చెందిన జె.అన్నపూర్ణమ్మ ఈ.రాజ్యలక్ష్మి, సీహెచ్‌ భార్గవి, సీహెచ్‌ కృష్ణప్రసాద్‌, ఈ.గోపాలకృష్ణ, మోక్ష పూర్వికుల క్రిస్‌మస్‌ పర్వదినం సందర్భంగా నరసరావుపేటలోని బంధువులు ఆహ్వనించటంతో కారులో బయలుదేరారు. నల్లపాడు గ్రామం కాలువ సెంటర్‌ వరకూ రాగా మితిమీరిన వేగంతో వెళుతున్న క్రషర్‌లారీ కారును వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో కారు సుమారు నాలుగు అడుగుల ఎత్తువరకూ లేచి సుమారు 10మీటర్ల దూరంలో డివైడర్‌పై ఉన్న విద్యుత్‌ పోల్‌ను ఢీకొట్టింది. దీంతో విద్యుత్‌ పోల్‌ రోడ్డు అవతలకు పడిపోగా కారు రోడ్డుపై పడింది. ప్రమాదంలో కారులోని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. కారు గాలిలో లేచిపడటంతో బెంబేలెత్తి హడలిపోయిన స్థానికులు తేరుకుని కారులోని క్షతగాత్రులను వెలికితీశారు. వెంటనే 108కు సమాచారం అందించటంతో రెండు వాహనాల్లో వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స  నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ సీఐ కె.వీరాస్వామి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-26T05:16:42+05:30 IST