రిజిస్ట్రేషన్లకు ... తంటాలు

ABN , First Publish Date - 2020-11-21T05:44:03+05:30 IST

రిజిస్ర్టేషన్‌శాఖలో అవినీతిని రూపుమాపాలని, తప్పుడు రిజిస్ర్టేషన్ల కు బ్రేక్‌ వేయాలని ప్రభుత్వాలు చర్యలు తీసుకుం టున్నాయి.

రిజిస్ట్రేషన్లకు ... తంటాలు

తెనాలిలో అంతరాయాలు 

సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనలో లోపం

సర్వర్‌ పని చేయక రిజిస్ట్రేషన్లలో జాప్యం 


 ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన రిజిస్ర్టేషన్‌ శాఖ ఎప్పటి కప్పుడు తంటాలు ఎదుర్కొం టూనే ఉంటోంది.  ఎప్పటికప్పుడు  సాంకేతిక పరిజ్ఞానం తో పాటు సంస్కరణలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ప్రజలకు సత్ఫలి తాలు  అందడంలేదు. అంతేగాక తరచూ కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. దీనినే కొందరు సబ్‌రిజిస్ర్టార్లు అను కూలంగా మలచుకుని ప్రజలను దోచేస్తు న్నారనే ఆరోపణలున్నాయి.


 గుంటూరు, నవంబరు 20: రిజిస్ర్టేషన్‌శాఖలో అవినీతిని రూపుమాపాలని, తప్పుడు రిజిస్ర్టేషన్ల కు బ్రేక్‌ వేయాలని ప్రభుత్వాలు చర్యలు తీసుకుం టున్నాయి. ఇందుకుగాను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అయితే అది సత్ఫలితాలు ఇవ్వకపోగా కొత్త సమస్యలకు కారణమవుతోంది. దీనినే కొందరు సబ్‌రిజిస్ర్టార్‌లు తమకు అనుకూ లంగా మలచుకొని ప్రజలను దోచేస్తున్నారనే ఆరో పణలు వినవస్తున్నాయి.  ఇందుకు నిదర్శనమే తెనాలిలో కొంతకాలంగా రిజిస్ర్టేషన్స్‌లో జరుగు తున్న అంతరాయాలు. తెనాలి టౌన్‌లో 12 రిజిస్ర్టే షన్‌ వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీలో కలసిన గ్రామీణ ప్రాంతానికి రెవెన్యూ సర్వే నెంబర్‌లు వేరుగా ఉన్నాయి. అయితే కొత్త సాఫ్ట్‌వేర్‌లో టౌన్‌ సర్వే నెంబర్‌ మాత్రమే నమోదు చేశారు. రెవెన్యూ సర్వే నెంబర్‌ను నమోదు చేయడానికి కొత్త సాఫ్ట్‌వేర్‌లో అవకాశం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ల సమయంలో రూరల్‌ ఏరియా సర్వే నెంబర్‌ కొడితే టౌన్‌ వివరాలు వస్తున్నాయి. పట్టణ సర్వే నెం బర్‌లో ఆస్తి నిషేధిత భూముల జాబితాలో ఉంటే అదే వస్తోంది. దీంతో ఆ ఆస్తి కలిగిన వారు గాని, దానిని కొనుగోలు చేసేవారు గానీ కంగుతిం టున్నారు. సాఫ్ట్‌వేర్‌లో లోపమేగానీ ఆస్తిలో ఎటు వంటి ఇబ్బందిలేదని చెప్పినా కొనుగోలు చేసేవా రు వెనుకాడుతున్నారు. ఈ విషయాన్ని సంబంఽ దిత అదికారుల దృష్టికి తీసుకువెళితే సాఫ్ట్‌వేర్‌ కారణంగా ఇలా జరుగుతుందంటున్నారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామంటున్నారే గానీ పరిష్కారం చూపటం లేదు. దీంతో ఏమి చేయాలో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. తెనాలిలో పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలో అనేక చోట్ల సర్వర్‌ పని చేయకపోవటం వల్ల  రిజిస్ట్రేషన్లలో జాప్యం జరుగుతోంది.  

48 గంటల్లో పూర్తి కాక నిలిచిపోతున్న కంప్యూటర్లు


ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లను సకాలంలో పూర్తి చేయ టం లేదంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వీటి ప్రకారం ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లను 48 గంటల్లో పూర్తి చేయకుంటే అక్కడి కంప్యూటర్లు బ్లాక్‌ అయ్యేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. తమ పరిధిలో ఆస్తిని మరో చోట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా ఫీజ్‌ టూ ఫీజ్‌ రావాల్సిన లంచానికి గండి పడుతుందని భావించిన సబ్‌ రిజిస్ట్రార్లు అటువంటి వాటికి సకా లంలో సమాధానం ఇవ్వకుండా పెండింగ్‌ పెడు తున్నారు. దీంతో ఎనీవేర్‌ రిజిస్టే్ట్రషన్‌కు మోక్షం కలగటం లేదని, విపరీతమైన జాప్యం జరుగు తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రభు త్వం 48 గంటల్లో ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లు సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌కు సమాధానం ఇవ్వకుంటే కంప్యూటర్లు బ్లాక్‌ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించారు. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లు ప్రోత్సహిస్తూ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధంగా ఆ రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సూచించిన సమయంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయకుంటే మొత్తం రిజిస్ట్రేషన్ల వ్యవస్థ స్తంభించేలా ఏర్పాట్లు చేశారు. 

కోర్టు వివాదాల ఆస్తికి ఎన్‌వోసి అవసరం..


కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే గతంలో సబ్‌ రిజిస్ట్రార్లకు అధికారం ఉండేది. ప్రస్తుతం దానిని సబ్‌ రిజి స్ట్రార్లకు అప్పగిస్తూ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసు కుంది. ఉదాహరణకు ఒక సర్వే నెంబర్‌లో సు మారు 50 ప్లాట్లు ఉంటే అందులో ఒకటి రెండు ప్లాట్లు మాత్రమే కోర్టు వివాదాల్లో ఉంటే ఆ సర్వే నెంబర్‌లో మొత్తంను బ్లాక్‌ లిస్టులో పెడుతు న్నారు. కోర్టు వివాదాల్లో లేని మిగిలిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ గతంలో సబ్‌ రిజిస్ట్రార్లు వాటిని పరి శీలించి రిజిస్ట్రేషన్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం వాటిని పరిశీలించి ఎన్‌వోసీ జారీ చేసే అధికా రాన్ని జిల్లా రిజిస్ట్రార్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదే శాలు జారీ చేసింది. అయితే కొందరు సబ్‌ రిజి స్ట్రార్లు దీనిని తమకు అనుకూలంగా మలచుకుం టూ దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వాస్త వానికి కోర్టు వివాదాలకు సంబంధించిన ఆస్తి రిజి స్ట్రేషన్‌లో డీఆర్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదు. సబ్‌ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్‌ను ఆన్‌లైన్‌లో పెడితే తన వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి ఆన్‌లైన్‌లోనే గంటల్లో ఎన్‌వోసీ ఇస్తారు. సబ్‌ రిజి స్ట్రార్లు ఇదంతా తెలిసి ఆయా పార్టీల వద్ద నుంచి లంచాలు పుచ్చుకుని తామేదో ఎన్‌వోసీ తెప్పిం చినట్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రెండు నెలలుగా మూగబోయిన ఫోన్లు..


రిజిస్ట్రేషన్ల శాఖలో సకాలంలో కరెంట్‌ బిల్లులు, ఫోన్‌ బిల్లులు చెల్లింపులు ఇవ్వలేని దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. గడిచిన కొన్నే ళ్లుగా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఆయా కార్యాలయాల్లో విద్యుత్‌ శాఖ అధికారులు ఫీజ్‌లు పీకటం, దీంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సబ్‌ రిజిస్ట్రార్లు ఎంతో కొంతో చెల్లించి ఫీజ్‌లు పీకకుండా విద్యుత్‌ శాఖ సిబ్బందిని బతిమాలుకుంటున్న సంఘటన లున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారుల ఫోన్‌ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తింది.  ఒకే నెట్‌ వర్క్‌ సిమ్‌లను జారీ చేస్తే దానికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో  గడిచిన రెండునెలలకు పైగా రిజిస్ట్రేషన్ల శాఖకు సంబం ధించిన ఫోన్లన్నీ మూగబోయాయి. ఏదైనా సమా చారం కోసం కానీ, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన విషయం కానీ మాట్లాడాలన్నా, ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా అధికారులతో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. బిల్లులకు సంబంధించిన ఫైల్‌ సచివాలయంలో ఉందని క్వార్టర్‌ బడ్జెట్‌ విడుదల చేస్తే కానీ ఫోన్లకు మోక్షం కలగదని అధికారులు అంటున్నారు. 

సాఫ్ట్‌వేర్‌లో లోపాలను ఎన్‌ఐసీ దృష్టికి ...


తెనాలిలో సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న లోపాలను సం బంధిత సాప్ట్‌వేర్‌ సంస్థ ఎన్‌ఐసీ దృష్టికి తీసు కు వెళ్ళాము. సాంకేతిక నిపుణులు దృష్టి సారిం చారు. సాధ్యమైనంత త్వర గానే సమస్య పరిష్కారం అవు తుంది.  సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని సరి చేసే వరకు అక్కడి సమస్య ఉంటుం ది. 48 గంటల్లో ఎనీవేర్‌ను, 24 గం టల్లో సాధారణ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ను పూర్తి చేయాలి. నిర్ణీత సమయా నికి ఎనీవేర్‌ పూర్తి చేయక కంప్యూ టర్‌లు బ్లాక్‌ అయితే వారిపై చర్యలు తప్పవు. 

- బాలస్వామి, డీఐజీ, రిజిస్ట్రేషన్‌


Updated Date - 2020-11-21T05:44:03+05:30 IST