కరోనా భయంతో.. ఆ నలుగురూ రాకపోయే..!

ABN , First Publish Date - 2020-04-24T14:10:02+05:30 IST

కరోనా భయంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా బంధువులు భయపడిన...

కరోనా భయంతో.. ఆ నలుగురూ రాకపోయే..!

తుమృకోట (రెంటచింతల): కరోనా భయంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా బంధువులు భయపడిన సంఘటన తుమృకోటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. తుమృకోటకు చెందిన ఓ మహిళ నుంచి ఇటీవల కరోనా శాంపిల్స్‌ సేకరించారు. ఆమె మంగళవారం మృతిచెందింది. దీంతో బుధవారం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఆ నలుగురు వ్యక్తులు రావడానికి భయపడ్డారు. ఓ దశలో ఒక దుప్పట్లో మూటకట్టి వెదురుబొంగుకు తగిలించి ఇద్దరు మోసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.


ఈ సమాచారం పోలీసులకు తెలియటంతో వారు స్థానికులకు నచ్చచెప్పారు. ఆమెకు నెగిటివ్‌ రిపోర్డు వచ్చిందని, భయపడాల్సిన పనిలేదని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు గ్రామస్థులకు తెలియజెప్పటంతో చివరకు మృతదేహాన్ని బంధువులు నులకమంచంపై ఉంచి అంత్యక్రియలు బుధవారం రాత్రికి ముగించారు.

Updated Date - 2020-04-24T14:10:02+05:30 IST