హక్కులు అందరికీ సమానంగా అందాలి
ABN , First Publish Date - 2020-12-11T06:23:08+05:30 IST
మానవ హక్కులు అందరికీ సమానంగా అందినప్పుడే ప్రపంచం శాంతితో సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర విద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తెలిపారు.
గుంటూరు(మెడికల్): మానవ హక్కులు అందరికీ సమానంగా అందినప్పుడే ప్రపంచం శాంతితో సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర విద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో గురువారం రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పీ రామచంద్రరాజు, హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రతినిధి సుజాత, ఇంటాస్ కన్వీనర్ ఎస్‌వీఎస్ లక్ష్మీనారాయణ, రెడ్‌క్రాస్ జిల్లా కోశాఽధికారి ఏ రవిశ్రీనివాస్, శారదా, మల్లేశ్వరి, నేపాక పద్మజ, పాల్గొన్నారు.