పారదర్శకంగా వలంటీర్ల నియామకం
ABN , First Publish Date - 2020-05-29T09:22:42+05:30 IST
సచివాలయ వలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు పారద్శకంగా నిర్వహిస్తుట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు.

గుంటూరు కార్పొరేషన్, మే28: సచివాలయ వలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు పారద్శకంగా నిర్వహిస్తుట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. వేంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరుగుతున్న వలంటీర్ల ఇంటర్వ్యూలను గురువారం ఆమె పరిశీలించారు. 447 వాలంటీర్ల పోస్టులకు 3500 మందిని ఇంటర్వ్యూలకు పిలిచినట్లు తెలిపారు. ఫోన్ మెసేజ్ వచ్చినవారే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.