రాజధాని తరలిస్తే తిరుగుబాటు

ABN , First Publish Date - 2020-07-20T10:38:30+05:30 IST

రాజధానిని తరలిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ హెచ్చరించారు. రాజధాని వికేంద్రీకరణ,

రాజధాని తరలిస్తే తిరుగుబాటు

మౌన దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ రామకృష్ణ


గుంటూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాజధానిని తరలిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ హెచ్చరించారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ తిరస్కరించాలని కోరుతూ రామకృష్ణ ఆదివారం గుంటూరులోని తన స్వగృహంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావుతో కలిసి దీక్ష చేపట్టారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారన్నారు.  ప్రతిపక్ష నేతగా అమరావతిని ఆమోదించి ఇప్పుడు జగన్మోహనరెడ్డి మడమ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ విచ్ఛన్నకరమైన విధానాలతో సమాజాన్ని కులాలు, మతాల వారీగా విభజిస్తున్నారని మన్నవ తెలిపారు. న్యాయస్థానాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల జగన్‌కు విశ్వాసం లేదన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.  

Updated Date - 2020-07-20T10:38:30+05:30 IST