పైసలిచ్చుకో... ప్లాట్లు వేసుకో

ABN , First Publish Date - 2020-11-26T05:18:53+05:30 IST

నరసరావుపేట జిల్లా కేంద్రం కాబోతుం దన్న ప్రచారంతో రియల్‌ అక్రమాలకు నెలవుగా మారింది.

పైసలిచ్చుకో... ప్లాట్లు వేసుకో
నరసరావుపేటలో రియల్‌ వెంచర్‌

నరసరావుపేటలో రియల్‌ అక్రమాలు

లంచం ఇవ్వకుంటే అక్రమ లేఅవుట్‌ అని బోర్డు 

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తోక్కెస్తున్న వైనం

అధికారులకు కాసులు కురిసిస్తున్న స్థిరాస్తి వ్యాపారం 

అక్రమ లేఅవుట్లపై మంత్రి ఆదేశాలను పట్టించుకోని అధికారులు


  రియల్‌ అక్రమాలకు నెలవుగా నరసరావుపేట మారింది. నిబంధనలు పాటించకపోయినా.. అను మతులు లేక పోయినా అడిగినంత ఇస్తే చాలు.. రియల్‌ వెంచర్ల అక్రమాలను అధికారులు పట్టిం చుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు పైసలు కొట్టి ఇష్టం వచ్చినట్లుగా ప్లాట్లు వేసేస్తున్నారు. నరసరావు పేట జిల్లా కేంద్రంగా మారుతున్నదని ఇప్పుడు స్థలం కొనుక్కోకపోతే భవిష్యత్తులో దొరకదని పెద్దఎత్తున భూమ్‌ సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. కాలు వలు, వాగులు కబ్జాకు గురవుతున్నా చర్యలు తీసు కుంటున్న దాఖలాలు లేవు. రియల్‌ అక్రమాలను అడ్డుకునే వారే కరువైన నేపథ్యంలో కొనుగోలు దారులే అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు.


నరసరావుపేట, నవంబరు 25: నరసరావుపేట జిల్లా కేంద్రం కాబోతుం దన్న ప్రచారంతో రియల్‌ అక్రమాలకు నెలవుగా మారింది. చర్యలు తీసు కోవాల్సిన అధికారులు అక్రమార్కుల పంచన చేరిపోయారు. పైసలివ్వు ప్లాట్‌లు వేసుకో అన్న రీతిలో అధికారులు వ్వవహరిస్తున్నారు. ఎవరైనా వ్యాపారి నిర్ణయించిన మేరకు లంచం ఇవ్వకుంటే రాత్రికిరాత్రి ఆ వెంచర్‌ వద్ద ‘ఇది అనుమతులులేని లే అవుట్‌’ అని బోర్డు వెలుస్తుంది. వారు నిర్ణ యించి రేటు చెల్లిస్తే ఆ బోర్డును వారే తొలగిస్తారు. అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు. జిల్లా కేంద్రం పేరుతో పాలపాడు, రావిపాడు, వల్లప్పచెరువు, ఇస్సపాలెం, అగ్ర హారం, ములకలూరు రహదారులలో రియల్‌ బూమ్‌ నెలకొంది. రెండు నెలల వ్వవధిలో పాలపాడు, రావిపాడు రహదారులలో స్థలాల ధరలు 50 శాతం నుంచి రెట్టింపు వరకు పెరిగాయి. హైదరాబాద్‌, విజయవాడ, గుం టూరు నగరాలలో లేని ధరలు నరసరావుపేటలో ఉన్నాయి. కొందరు రియ ల్‌, కమీషన్‌ వ్యాపారులు స్థలాల ధరలను అమాంతం పెంచేశారు. జిల్లా అయితే ఇక స్థలాలు దొరకవన్న అపోహలు సృష్టించి సొమ్ము చేసుకుం టున్నారు. స్థలాలు చేయి మార్పిడి జరుగుతున్నాయి. రిజిష్ట్రేషన్లు జరుగు తున్నవి నామమాత్రంగానే ఉన్నాయి. ఎదో ఒక స్థాయిలో ధరలు పడిపోతా యన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే ఎంతో మంది నష్టపోయే ప్రమాదం ఉంది. లింగంగుంట అగ్రహారం భూములకు కోర్టు ఉత్తర్వులు మేరకు రిజిష్ట్రేషన్లను ప్రభుత్వం నిషేధించింది. అయినా  ఈ పొలాల్లో కూడా వెంచర్లు వెలిశాయి. ఈ స్థలాల విక్రయాలు అగ్రిమెంట్లపైనే జరుగు తున్నాయి. ఎవరు విక్రయించినా, కొనుగోలు చేసినా చెల్లవని పుష్పగిరి పీఠం సంస్థ లీగల్‌ నోటీసులో ప్రకటించింది. అయినా ఈ పొలాల్లో ప్లాట్ల విక్రయాలు జరుగుతునే ఉన్నాయి.


నిబంధనలు ఇలా..

రియల్‌ వెంచర్లలో నిబంధనల ప్రకారం 30 అడుగుల రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్‌, వీధి దీపాలు ఏర్పాటుతో పాటు లే అవుట్‌లో 10 శాతం సామాజిక అవసరాలకు కేటాయించాలి. లేఅవుట్‌కు సదరు పంచాయతీ అనుమతి పొందాలి. అయితే ఇవేవి లేకుండానే అధికారులు మాముళ్ళు దండుకుని మిన్నకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.   వందల సంఖ్యలో లే అవుట్లు ఉంటే రెండు మూడు వెంచర్లకు కూడా అనుమతులు లేవన్న బోర్డులు లేవు. దీనినిబట్టి ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. వెంచర్లలో నిబంధనలకు విరుద్ధంగా గోడలు నిర్మిస్తున్నా పట్టించుకునేవారే లేరు. 

Updated Date - 2020-11-26T05:18:53+05:30 IST